Telugu Gateway
Politics

జ‌గ‌న్ పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు

జ‌గ‌న్ పై నారా లోకేష్ విమ‌ర్శ‌లు
X

మూడు రాజ‌ధానుల‌కు సంబంధించిన అంశంపై సోమ‌వారం నాడు అసెంబ్లీ వేదిక‌గా చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 'తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని.' అంటూ పేర్కొన్నారు. జ‌గ‌న్ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తూ గ‌తంలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను త‌న ట్వీట్ కు జ‌త చేశారు. ఇదే అంశంపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ కూడా స్పందించారు.

జ‌గ‌న్ తాజా ప్ర‌క‌ట‌న‌తో మూడు రాజ‌ధానుల‌పై మ‌రింత అనిశ్చితి ఏర్ప‌డింద‌న్నారు. కోర్టులో వాదనలు కొలిక్కి వస్తున్నాయని, తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని తెలిపారు. అన్ని లెక్కలు వేసుకునే ఈ సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళం ఏర్పడిందన్నారు. 3 రాజధానులు అనాలోచిత నిర్ణయానికి బాద్యులు ఎవరు? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెపుతారని నిలదీశారు. గతంలో చేసిన చట్టాలు తప్పు అని జగన్ అంగీకరించినట్లేనని కేశవ్ పేర్కొన్నారు.

Next Story
Share it