ప్రజలే మీకు గుండు కొట్టిస్తారు
BY Admin8 April 2022 3:48 PM GMT

X
Admin8 April 2022 3:48 PM GMT
సీఎం జగన్ నంద్యాలతో చేసిన వెంట్రుక వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ అంశంపై జగన్ కు కౌంటర్ ఇచ్చారు. 'గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం.' అంటూ స్పందించారు.
Next Story