Telugu Gateway
Politics

జ‌గ‌న్ ది విచిత్ర ధోరణి...కపట మనస్తత్వం

జ‌గ‌న్ ది విచిత్ర ధోరణి...కపట మనస్తత్వం
X

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరుపై జ‌న‌సేన పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లేని స‌మ‌స్య‌ను సృష్టించి..తానే ప‌రిష్కారం చేసిన‌ట్లు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. సినీ ప్రముఖుల్ని పిలిచి జ‌గ‌న్ పబ్లిసిటీ స్టంట్ చేశారన్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. విశాఖ రమ్మని పిలుస్తున్న ముఖ్యమంత్రి జ‌గ‌న్ కు అమరావతి గుర్తుకు రాలేదా అన్నారు. సామాన్యుడి అర్జీకి సీఎం కార్యాలయం స్పందించే పరిస్థితి లేదని ఆరోపించారు. నాదెండ్ల మ‌నోహ‌ర్ మంగ‌ళ‌గిరిలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ ది విచిత్ర ధోరణి, కపట మనస్తత్వం అని మండిపడ్డారు. ఉద్యోగుల విషయంలోనూ కించపరచేలా వ్యవహరించారు.. కాబట్టే ఉద్యోగ సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి అన్నారు. సర్వశాఖలు అప్పగించిన ఓ మహా సలహాదారుడు ఆధ్వర్యంలోనూ చర్చలు జరిగాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తరఫున మీడియాతో ఆయనే మాట్లాడతారు అన్నారు. సినిమా టిక్కెట్ల కోసం కేటాయించిన సమయాన్ని అమరావతి రైతుల కోసం, గోతులమయంగా మారిన రహదారుల కోసం, రోడ్డెక్కిన రైతాంగం కోసం ఎందుకు కేటాయించడం లేదన్నారు. సొంత పబ్లిసిటీ కోసం వ్యవస్థలని దుర్వినియోగం చేస్తూ, అక్కడ ఉన్న పెద్ద మనుషుల్ని లొంగ దీసుకుని, భయపెట్టి సమస్య పరిష్కారం నేనే చేస్తాను, నా దగ్గరకు వచ్చి మీరు పూర్తి స్థాయిలో తగ్గాలి అన్న మెసేజ్ తీసుకువెళ్తున్నారు. ఆయనేదో మహారాజులా.. అంతా ఆయన చేతుల మీదుగా జరిగినట్టు చిత్రిస్తున్నారు.ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లు లేరా? ఎగ్జిబిటర్లు లేరా? థియేటర్ యజమానులు లేరా? ఎందుకు మీరు వాళ్లతో కూర్చొని చర్చించలేదు. ఎందుకు క్షేత్ర స్థాయిల్లో జరుగుతున్న మీటింగుల్లో మీరు పాలుపంచుకోలేదు. ముఖ్యమంత్రి కేవలం హీరోలతోనే కూర్చుంటారా? మిగిలిన వాళ్లను కూడా పిలిపించి మాట్లాడరా? ఎందుకు మీరు ఈ పబ్లిసిటీ ఎక్సర్ సైజులు చేస్తున్నార‌న్నారు.

Next Story
Share it