Telugu Gateway
Politics

ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌హ‌క‌రించాలి

ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌హ‌క‌రించాలి
X

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధికి ఇదే కీలక సమయమని, దేశ ఆర్థిక పురోగతి, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటి అంశాల్లో ప్రపంచానికి భారత్‌పై మరింత విశ్వాసం పెంపొందించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వేదిక కావాలని ప్రధాని అభిలషించారు. వీటన్నింటిపై హృదయపూర్వకంగా చర్చించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాలకు ఎంపీలకు స్వాగతం పలుకుతున్నామని, ఇవాల్టి ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో గొప్పగొప్ప అవకాశాలున్నాయని, దేశాభివృద్ధికి కీలకమైన సమయంలో అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

చర్చలు ఫలప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుతుందని చెప్పారు. అయితే విప‌క్ష పార్టీలు మాత్రం కేంద్రంపై ప‌లు కీల‌క అంశాలు ఎక్కు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ప్ర‌ధానంగా పెగాసెస్ స్పైవేర్ వ్య‌వ‌హారం ఈ సారి స‌మావేశాల్లో దుమారం రేపే అవ‌కాశం క‌న్పిస్తోంది. ఓ వైపు న్యూయార్క్ టైమ్ప్ క‌థ‌నంతోపాటు సైబ‌ర్ నిపుణులు ఫోన్ల‌లో ఈ మాల్ వేర్ ఉంద‌ని నిర్ధారించ‌టంతో ప్ర‌ధాన పార్టీల‌కు అస్త్రం దొరికిన‌ట్లు అయింది.

Next Story
Share it