Top
Telugu Gateway

మోడీ..ఓ పెద్ద ఈవెంట్ మేనేజర్

మోడీ..ఓ పెద్ద ఈవెంట్ మేనేజర్
X

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అటు కేంద్రం కానీ..ఇటు మోడీ కానీ ఇప్పటివరకూ కరోనా మహమ్మారిని సరిగ్గా అర్ధం చేసుకోలేదని విమర్శించారు. ప్రధాని మోడీ భారత్ లో మరణాల రేటుపై చెప్పేవన్నీ అబద్దాలే అని ఆరోపించారు. దేశంలో వైరస్‌ వ్యాప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కారణమని విమర్శించారు. ఈ సెకండ్‌ వేవ్‌కు మోదీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రెండు శాతం ప్రజలకు వాక్సిన్ ఇచ్చి వైరస్‌కు గేట్లు బార్లా తెరిచారు అని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పెద్ద ఈవెంట్ మేనేజర్ అని రాహుల్‌ అభివర్ణించారు.

కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్‌ వేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. 'మనకు కావాల్సింది ఈవెంట్ మేనేజ్‌మెంట్ కాదు.. వైరస్ కట్టడికి వ్యూహాలు కావాలి. వ్యాక్సిన్‌పై సరైన వ్యూహం లేకపోతే మళ్లీ అనేక వేవ్‌లు వచ్చే అవకాశం ఉంది. కరోనా మరణాల గణాంకాలు అబద్ధం. ప్రభుత్వం వీటిపై ప్రజలకు నిజం చెప్పాలి. కరోనా పై మేం పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. వ్యాక్సిన్‌ ఒక్కటే శాశ్వత పరిష్కారం' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it