Telugu Gateway
Politics

కెసీఆర్ ప్ర‌ధాని అయితే యువ‌త‌కు ఉద్యోగాలొస్తాయి

కెసీఆర్ ప్ర‌ధాని అయితే యువ‌త‌కు ఉద్యోగాలొస్తాయి
X

కెసీఆర్ ప్ర‌ధాని కావాల‌ని మొక్కుకున్నా

నేను కోరిన కోరిక‌ల‌న్నీ అమ్మ‌వార్లు తీర్చారు

మంత్రి మ‌ల్లారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న శుక్ర‌వారం నాడు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌లో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కెసీఆర్ ప్ర‌ధాని కావాల‌ని మొక్కుకున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో తాను కోరిన కోరిక‌ల‌ను అమ్మ‌వార్లు తీర్చార‌ని అన్నారు. ప‌ది సంవత్స‌రాల నుంచి తాను ఏది కోరుకున్నా అది విజ‌య‌వంతం అయింద‌ని, ఇప్పుడు ఒక్క‌టే ఒక కోరిక కోరాన‌ని..ఒక్క సారి సీఎం కెసీఆర్ ప్ర‌ధానిని చేస్తే భార‌త దేశం అంతా స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌ని అన్నారు.

అంద‌రికీ క‌రెంట్,, సాగునీరు, తాగునీరు వ‌స్తుంద‌న్నారు. యువ‌త‌కు మంచి ఉద్యోగాలు వ‌స్తాయి. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో..భార‌త‌దేశం అంతా కూడా రెండు సంవ‌త్స‌రాల్లోనే చేసి చూపిస్తార‌న్నారు. త‌ప్ప‌కుండా వ‌న‌దేవ‌త‌లు త‌న మొక్కులు తీరుస్తార‌న్నార‌న్నారు. మెడిక‌ల్ కాలేజీ కావాల‌నుకున్నా.. నాకు వ‌న‌దేవత‌లు ఇచ్చారు. ఎంపీ కావాల‌నుకున్నా ఎంపీ అయ్యాను. మినిస్ట‌ర్ కావాల‌నుకున్నా..మినిస్ట‌ర్ అయ్యా. ఇప్పుడు ప్రైమ్ మినిస్ట‌ర్ మా కెసీఆర్ కావాల‌ని మొక్కినా..త‌ప్పుకుండా అయిత‌రు.

Next Story
Share it