Top
Telugu Gateway

టీఆర్ఎస్ తోక ఎలా తొక్కాలో మాకు తెలుసు

టీఆర్ఎస్ తోక ఎలా తొక్కాలో మాకు తెలుసు
X

హైదరాబాద్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంఐఎం శాసనాసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారు..హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలన్నారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు.

మళ్లీ ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారని ప్రభుత్వంపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ తోక ఎలా తొక్కాలో తమకు తెలుసన్నారు. గత కొన్ని రోజులుగా ఎంఐఎంకు చెందిన నేతలు మంత్రి కెటీఆర్ టార్గెట్ గా కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది అంతా మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే సాగుతోందనే విమర్శలు ఉన్నారు. ఓ వైపు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ హైదరాబాద్ లో తమ పోటీ కేవలం ఎంఐఎంతో అని వ్యాఖ్యానిస్తారు కానీ ఇంత వరకూ ఎక్కడా ఆ పార్టీపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు.

Next Story
Share it