కెసీఆర్ పార్టీ ఎందుకు..రెండు రాష్ట్రాలను కలిపేస్తే పోతుంది

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన ఏపీలో పార్టీ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?. ఏకంగా రెండు రాష్ట్రాలను కలిపేస్తే పోతుంది అంటూ స్పందించారు. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ లో తీర్మానం చేస్తే బెటర్ అంటూ సూచించారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని కోరుతున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదేనన్నారు. ఏపీ తెలంగాణ లు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని అన్నారు. దుర్మార్గంగా విడగొట్టొద్దన్నారని చెప్పారు.
కెసీఆర్ పార్టీ పెట్టాలని తాము కూడా కోరుకుంటున్నామన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చన్నారు. అప్పుడు కొత్తగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది. రెండు రాష్ట్రాలను కలిపేస్తే అదే పార్టీ పోటీచేయవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కెసీఆర్ ఈ మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ నేత సజ్జల కూడా కెసీఆర్ ను ఏపీలో పార్టీ పెట్టొద్దని ఎవరు కోరారన్నారు. హైదరాబాద్ లేకపోవటం వల్ల ఏపీకి భారీ నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు.