మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం మే5న
సంచలన హ్యాట్రిక్ విజయం దక్కించుకున్న మమతా బెనర్జీ మే5న తిరిగి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంత భారీ విజయంలోనూ ఆమె నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా తానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 5న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు దీదీ ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గవర్నర్‌ను కలవనున్నారు.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఎలాగైనా మమతా బెనర్జీని ఈ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు చేసిన ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఒంటికాలుతో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి సూపర్ సక్సెస్ సాధించి బిజెపికి షాక్ ఇచ్చారు.