Telugu Gateway
Politics

మ‌భ్య‌పెట్ట‌డం..మోసం చేయ‌ట‌మే కెసీఆర్ అల‌వాటు

మ‌భ్య‌పెట్ట‌డం..మోసం చేయ‌ట‌మే కెసీఆర్ అల‌వాటు
X

ఎమ్మార్పీఎస్ వ్వవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ట మాదిగ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ చీటర్ అంటూ మండిప‌డ్డారు. కెసీఆర్ ఏడేళ్ళ పాల‌న‌తోనే సీఎం కేసీఆర్ కు దళితుల సాధికారత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తేలిపోయింద‌న్నారు. వెలమరాజ్యం వస్తుందని తాను గ‌తంలోనే చెప్పాన‌ని..ఇప్పుడు అదే జ‌రిగింద‌న్నారు. చివ‌ర‌కు వామపక్షాలు కేసీఆర్ కే వత్తాసు పలుకుతున్నాయ‌ని విమ‌ర్శించారు. దళితుల సాధికారత ను చంపిందే కేసీఆర్ అని ఆరోపించారు. జర్నలిస్టులు..దళిత మేధావులు..ప్రతిపక్షాల‌కు చెందిన‌ నేతలు కేసీఆర్ గడీలో బందీలయ్యార‌ని విమ‌ర్శించారు. మంద కృష్ట మాదిగ బుద‌వారం నాడు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయనవేదిక అద్యర్వంలో జ‌రిగిన మీట్ ద పెస్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులపై ప్రేమ కురిపించడం ఒట్టి మోసమని ఆరోపించారు.దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతారని హమీ ఇవ్వడం మొదలు ఇప్పటి వరకు అయన మాటలన్నీ నీటి మూటలేన‌ని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంగా అవిర్బవిస్తే సామాజిక,ప్రజాస్వామిక తెలంగాణ రావాలని ఆందరూ కొరుతున్నారన్నారు. ఇప్పుడు దళిత సాదికారత పేరుతో 1200 కోట్లు ఇస్తామని చేప్తూ మరోసారి మభ్యపెట్టాలని చూస్తూన్నారని అరోపించారు. ప్రస్తుత తెలంగాణ గడ్డమీద తమ ద్వారనే సామాజిక తెలంగాణసాద్యం అని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో లో దళితులు మంత్రి వర్గంలో ఆరు మంది ఉంటే, అందులో తెలంగాణలో ముగ్గురు ఉన్నారని కాని తెలంగాణ వచ్చిన తరువాత జనాభా ప్రకారం నాలుగు పదవులు రావాల్సి ఉంది. కానీ కేసీఆర్ కేవలం ఒక్కరికే అవకాశం ఇచ్చారన్నారు. సమర్ధుడైన కడియం శ్రీహరి ని ఎందుకు కేబినెట్ లోకి తీసుకోలేదని ప్రశ్నించారు.తెలంగాణ రావడానికి కేసీఆర్ కాదన్నారు. 12 వందల మంది బలిదానాలు..లక్షల మంది బహుజనుల పోరాటమే కారణం. ధూంధాం కోట్ల మంది ని చైతన్యం కలిగించిందని చేప్పారు.ఒక్క శాతం లేని వెలమలకు 8 శాతం మంత్రి పదవులా?. ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ వంటి ఎందరో మేధావులు కేసీఆర్ చుట్టూ చేరిపోయారు.

ఆరువేల మందికి మూడెకరాల భూమిని పంచి.. లక్ష ఎకరాలకు పైగా లాక్కున్నారు. వరంగల్ కలెక్టరేట్, పోలీసు కమీషనర్ కార్యాలయం దళితుల భూమిని బలవంతంగా గుంజుకుని నిర్మించారు. ఆ భూముల విలువ ఎకరా రెండు కోట్లు పలుకుతున్నాయి. కాబట్టే గుంజుకున్నారు. తెలంగాణ రాక ముందు ఏడు లక్షల మంది దళితులకు అసైన్డ్ భుములు ఉంటే ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది. తప్ప పెరగడం లేదు.ఫార్మా కంపెనీలకు, ప్రాజెక్టులకు, దేవాలయాల నిర్మాణానికి భూములు దొరుకుతాయి కానీ, దళితుల కోసం భూములు దొరకడం లేదా?. పది లక్షలకు ఎకరం లెక్కన కొని ఇప్పించడం ఇష్టం లేదు కేసీఆర్ కు.దళితులు, బహుజనులు కేసీఆర్ మోసాలను గ్రహించినప్పుడు, కేసీఆర్ భ్రమల నుండి బయట పడ్డప్పుడు ఖచ్చితంగా వెలమ దొరల గడీల పాలన అంతం అవుతుంది. తెలంగాణ పిసీసి కమిటీ ఏర్పాటులో ఏఐసీసీ మాదిగలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాదిక్, ఉపాధ్యక్షుడు జంగిటి వెంకటేష్, సంయుక్త కార్యదర్శి మధు , కోశాధికారి సురేష్ మిట్ ద ప్రెస్ నిర్వహించారు.

Next Story
Share it