Telugu Gateway

బిజెపికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి

బిజెపికి వ్యతిరేకంగా అందరూ ఏకం  కావాలి
X

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని పలు పార్టీ నేతలకు లేఖలు రాశారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ లో మూడవ సారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎలాగైనా గెలవాలని బిజెపి సర్వశక్తులు ఒడ్డుతుంటే..మూడవ సారి అధికారం నిలబెట్టుకునేందుకు మమత కూడా అంతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో బిజెపిపై పోరాటానికి అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

తాజాగా ఢిల్లీలో రాష్ట్ర అధికారాల కత్తెరించేందుకు చేసిన చట్టంతో పాటు ఈ లేఖలో పలు అంశాలను ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతోపాటు ఏపీ సీఎం జగన్, డీఎంకె అధినేత స్టాలిన్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే తదితర నేతలకు లేఖలు రాశారు. ప్రజాస్వామ్య స్పూర్తి, ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగించేలా బిజెపి వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల అనంతరం భవిష్యత్ కార్యాచరణకు తాను సిద్ధం అన్నారు. ఈ తరుణంలో మమతా లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story
Share it