Telugu Gateway
Politics

నందిగ్రామ్ మమతదే

నందిగ్రామ్ మమతదే
X

మమతా బెనర్జీ సాధించారు. ఆమె పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ఒకెత్తు అయితే..నందిగ్రామ్ నుంచి గెలుపొందటం మరో ఎత్తు. రాష్ట్రంలో టీఎంసీ గెలుపు పక్కా అనే సంకేతాలు కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత కొద్దిసేపటికే వచ్చినా కూడా నందిగ్రామ్ విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం ఆ ప్రాంతంలో ఎంతో పట్టున్న సువేందు అధికారి బిజెపిలో చేరి మమతాకు సవాల్ విసిరారు. ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న మమతా తన సొంత సీటు కాకుండా నందిగ్రామ్ బరిలో నిలిచి విజయం సాధించి సంచలనం సృష్టించారు.

పలు రౌండ్లలో సువేందు అధికారి చాలా రౌండ్లలో మమతా కంటే ముందు ఉండటంతో ఈ ఫలితంపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. చివరకు సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆదిక్యంతో మమతా బెనర్జీ గెలవటంతో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గెలుపు పరిపూర్ణం అయింది. మమతా బెనర్జీ ఏకంగా 200కు పైగా సీట్లతో సంపూర్ణ విజయం సాధించటం ద్వారా దేశంలో సంచలనం సృష్టించారనే చెప్పాలి.

Next Story
Share it