సోనియా నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సిందే
గత ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభలో కౌశిక్ రెడ్డికి వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అన్న విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ నిర్ణయాన్ని పార్టీలో అందరూ ఆమోదించాల్సిందే అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద పాడి కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భట్టి ఖండించారు. క్రమశిక్షణ కలిగి కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను, అమలు జేయడం కోసం అందరూ ముందుండి.. నడిపించాలన్నారు.
తెలంగాణ ఇన్ చార్జి జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్ పై డబ్బులు అభియోగాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి అభాండాలు మొత్తం పార్టీకి నష్టం కలిగిస్తాయన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఓట్లు చీలినా.. స్థిరమైన ఓట్ బ్యాంక్ తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ప్రకటనలో తెలిపారు.