Telugu Gateway
Politics

కరోనా పై గెస్ట్ ఆర్టిస్ట్ ల్లా రోజుకో మంత్రి సమీక్షా?

కరోనా పై గెస్ట్ ఆర్టిస్ట్ ల్లా రోజుకో మంత్రి సమీక్షా?
X

కెటీఆర్ కు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ ఇచ్చాకే వ్యాక్సినేషన్ ఆగింది

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శలు చేశారు. కరోనాపై పూర్తిస్థాయిలో ఒక మంత్రి పర్యవేక్షణ ఉండాలి కానీ.. గెస్ట్ యాక్టర్లలా రోజుకొకరు సమావేశాలు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాతాళ భైరవి సినిమాలోలాగా అప్పుడప్పడూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకువస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌గా వచ్చాకా కరోనా వ్యాక్సిన్ రాష్ట్రంలో పూర్తిగా బంద్‌ అయ్యిందని విమర్శించారు. మంగళవారం ఆయన జూమ్‌ సమావేశంలో మీడియాతో మాట్లాడారు.

కార్పొరేట్, ప్రైవేట్‌ ఆసుపత్రులు.. కరోనా రోగుల నుంచి వసూలు చేస్తున్న భరించలేని ఫీజులను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ ఉందో, ఏ ఆసుపత్రిని పరిశీలించిందో? ఎక్కడ ఫీజులు నియంత్రణ చేసిందో ఇప్పటి వరకూ తెలియలేదన్నారు. సోనూసూద్ మాదిరిగా తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లు ఆర్టిస్టులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చిన కరోనా బాధితులకు అండగా నిలవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Next Story
Share it