Telugu Gateway
Politics

రాజ‌కీయ పార్టీల‌కు మంత్రి కెటీఆర్ హెచ్చ‌రిక‌

రాజ‌కీయ పార్టీల‌కు మంత్రి కెటీఆర్ హెచ్చ‌రిక‌
X

మ‌మ్మ‌ల్ని ఒక‌టి అంటే..ఇక నుంచి ప‌ది అంటాం

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి ఎవ‌రైనా త‌మ‌ను ఒక‌టి అంటే తాము ప‌ది అంటామ‌ని హెచ్చ‌రించారు. ఉరుకుంటే చిల్లర గాళ్ల మాటలు ఎక్కువగా అయితున్నాయ‌ని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజ‌కీయ శ‌క్తి అన్నారు. జ‌ల‌విహ‌ర్ లో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో కెటీఆర్ మాట్లాడారు. ఇవ్వాళ ఎగిరిపడుతున్న చిల్లర- మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్ళను ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కానిర్రు అని ప్ర‌శ్నించారు. నిన్న మొన్న పుట్టిన చిల్లర గాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏడేళ్లు ఓపిక పట్టాం- కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్తామ్ అని తెలిపారు. విమర్శలు చేసే వాళ్ళను అంగట్ల కొత్త వేష‌గాళ్లను చూసినట్లు ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ను ఎవ్వరూ- ఏ పార్టీ అడ్డుకోలేదని ధీమా వ్య‌క్తం చేశారు. పార్టీలో ప‌నిచే్స్తున్న కొంత మందికి ఇంకా ప‌ద‌వులు రాలేద‌నే నిరాశ ఉంద‌ని..త్వ‌ర‌లోనే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు అన్నీ భ‌ర్తీ చేస్తామ‌న్నారు.

Next Story
Share it