Telugu Gateway
Politics

డ్ర‌గ్స్ తో నాకేంటి సంబంధం?

డ్ర‌గ్స్ తో నాకేంటి సంబంధం?
X

డ్ర‌గ్స్ కూ త‌న‌కు సంబంధం ఏమిట‌ని తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ ప్ర‌శ్నించారు. ఈడీ కి ఎవడో పిచ్చోడు ఫిర్యాదు చేసాడ‌ని వ్యాఖ్యానించారు. 'నన్ను డ్రగ్స్ అంబాసిడర్ అంటారా ?. డ్రగ్స్ కు నాకు సంబంధమేంటి ? .నేను అన్నిరకాల‌ పరీక్షలకు సిద్ధం.. రాహుల్ సిద్ధమా ?' అని మంత్రి కెటీఆర్ ప్ర‌శ్నించారు. గ‌జ్వేల్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ‌లో కెసీఆర్ మ‌ద్యానికి, కెటీఆర్ డ్ర‌గ్స్ కూ బ్రాండ్స్ అంబాసిడ‌ర్లు అంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. వీటిపైనే మంత్రి కెటీఆర్ స్పందించారు. అవ‌స‌రం అయితే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌న్నారు. సున్నాలు వేసుకునే వారు క‌న్నాలు వేస్తున్నార‌న్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాద‌న్నారు. జూన్ 2న తెలంగాణ విమోచ‌న దినం అని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. కొంద‌రు ముఖ్య‌మంత్రిని తాగుబోతు అంటున్నారు. ఎవ‌రినీ వ‌దిలిపెట్టం. అంద‌రి జాత‌కాలు బ‌య‌ట పెడ‌తాం అని హెచ్చ‌రించారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, సంక్షేమంలో మేము నిమగ్నమయ్యాం. మేము- మా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నాము. కేసీఆర్ అభివృద్ధి పథకాలు చూసుకుంటూ పాదయాత్రలు చేస్తున్నారు. నిన్న గాక మొన్న వచ్చిన ఒకాయన మార్కెట్ లో నేనున్నాను అని చూపుకుంటున్నారు. కొత్తగా కాంగ్రెస్ లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. రేపు భవిష్యత్ లో పీసీసీ కూడా అమ్ముకుంటారు. 50కోట్లు పెట్టి ఠాకూర్ పీసీసీ అమ్మాడు అని అప్పట్లో వాళ్లే విమర్శలు చేసుకున్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఇంతకంటే గొప్పగా సభలు పెట్టారు.

ప్రజలు చాలా చైతన్యవంతులు ఎవరికి ఓట్లు వెయ్యలో వాళ్లకు తెలుసు.* తెలంగాణ లో ఎంఐఎం కి ఎవ్వరూ భయపడటం లేదు- బీజేపీ భయపడుతోంది. బీజేపీ ఆదిలాబాద్ కి ట్రైబెల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు ఇచ్చారా? సాయుధ పోరాటం చేసిన నేతలకు పెన్షన్స్ ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడం లేదు!. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి తెలంగాణ కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ఒక్క దాని గురించి అయినా చెప్పారా? ఎంపిలుగా గెలిచి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎమ్ చేశారు? ఢిల్లీ పార్టీలు సిల్లి పాలిటిక్స్ చేస్తున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీలకు కేసీఆర్ మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నాయి- ఢిల్లీ పార్టీల పై ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్- బీజేపీ పై షర్మిల- ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదు? టీఆర్ఎస్ ఓటును చీల్చడానికి ఉద్భవించిన పార్టీలు షర్మిల- ప్రవీణ్ కుమార్. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజలకు లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటేనే- దేశంలో ఎక్కడా లేని ప్రథకాలు అమలు అవుతున్నాయా?. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే తెలంగాణ కుపెట్టుబడులు- తెలంగాణ అభివృద్ధి అగుతుందా? . పీసీసీ కొనుకున్నోడు- రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా?. రాష్ట్రం గురించి ఒక ఎంపీ మాట్లాడితే అతన్ని గాడిద అంటావా? క్రిమినల్స్ కు ఛార్జిషీట్స్ మాత్రమే తెలుసు! రోజు కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రమే చార్జిషీట్లు అంటరు. * ఈటెల రాజేందర్ జానారెడ్డి కంటే పెద్దవాడు కాదు కదా అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it