అది అనాగరిక చర్య
BY Admin5 Oct 2021 7:00 AM

X
Admin5 Oct 2021 7:00 AM
ఉత్తరప్రదేశ్ లో ఆందోళన చేస్తున్న వారిపై కారు నడిపించి రైతుల హత్యకు కారణమైన ఘటనపై తెలంగాణ మంత్రి కెటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన మంగళవారం నాడు ట్వీట్ చేశారు. ఉత్తర్రపదేశ్ లోని లఖీంపూర్ లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ ఘటన చూసి షాక్ కు గురవటంతోపాటు..భయాందోళనలకు లోనయ్యానని అన్నారు. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. యూపీ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే మంత్రి కెటీఆర్ మాత్రం చాలా తాపీగా మంగళవారం నాడు దీనిపై స్పందించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story