Telugu Gateway
Politics

దేవరయాంజాల్ లో కెటీఆర్..నమస్తే తెలంగాణకు భూములు

దేవరయాంజాల్ లో కెటీఆర్..నమస్తే తెలంగాణకు భూములు
X

డాక్యుమెంట్లు విడుదల చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి

సీబీఐ విచారణకు డిమాండ్

దేవరయాంజాల్ భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం ఓ వైపు ఇందులో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆక్రమణలు ఉన్నాయని విచారణకు ఆదేశిస్తే..ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరో మలుపుతిప్పారు. ఈ భూముల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ తోపాటు నమస్తే తెలంగాణకు చెందిన దామోదర్ రావుకు కూడా భూములు ఉన్నాయంటూ డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారానికి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాజ్యమే దోపిడీకి పాల్పడుతోంది...రాజే అందులో పాత్ర దారి. రాజే దోపిడీ చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. దేవుడు మాట్లాడలలేడు కాబట్టి మేం కొల్లగొడతాం అంటే కుదరదు. మేమే దేవుడి ప్రతినిధులు అని చెప్పుకునే బిజెపి వాళ్లు ఏమి చేస్తారో చూస్తాం. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలి. ఎంపీగా నేను ఫిర్యాదు చేస్తా. ఇది నా పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. 2009లో కెటీఆర్ ఇక్కడ భూములు కొన్నారు...2015లో దామోదర్ రావు కొన్నారు. 2015లో 33 లక్ష్లకు రెండు ఎకరాలుపైన ఎలా వచ్చింది.

మీరే కోట్ల రూపాయయలు అంటున్నారు. మీకు మరి అంత తక్కువకు ఎలా వచ్చింది. మంత్రి మల్లారెడ్డి తోపాటు టీఆర్ఎస్ నాయకులు చాలా మందికి ఇక్కడ భూములు ఉన్నాయి, గోడౌన్లు ఉన్నాయి. దేవుడి భూములను తనఖా పెట్టి కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. దేవుడి మాన్యాల‌ను ఆక్ర‌మించార‌ని న‌మ‌స్తే తెలంగాణ‌లోవార్త వచ్చింది. క‌ల్వ‌కుంట్ల తారక రామారావు కి కూడా భూములు ఉన్నాయి. ఆ వార్త న‌మ‌స్తే తెలంగాణ‌లో క‌న్పించ‌దు. న‌మ‌స్తే తెలంగాణ ప‌బ్లికేష‌న్‌కు 437 స‌ర్వే నెం.లో 2ఎక‌రాల 8 గుంట‌ల భూమి ఉంది. దేవ‌ర యాంజ‌ల్ దేవ‌దాయ భూముల్లోనే న‌మ‌స్తే తెలంగాణ ప్రింట్ అవుతుంది. ప్ర‌భుత్వానికి చిత్తశుద్ది ఉంటే న‌మ‌స్తే తెలంగాణ భూముల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టాలి. ప్ర‌భుత్వం నియ‌మించిన ఐఎఏస్ క‌మిటీ న‌మ‌స్తే తెలంగాణ తేల్చాలి. స‌ర్వే నెం. 437 నిషేధిత భూముల జాబితాలో ఉంది.

దేవదాయ శాఖ భూముల‌కు సంబంధించిన స‌ర్వే నెంబ‌ర్ల‌ను ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్ట‌లేదు. రంగారెడ్డి చెందిన దేవ‌దాయ శాఖ‌కు చెందిన భూముల వివ‌రాల‌ను ఎందుకు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో పెట్ట‌లేదు. దేవ‌ర‌యాంజ‌ల్ భూముల విచార‌ణ సరిగా జ‌ర‌గాలంటే మంత్రులు కేటీఆర్‌, మ‌ల్లారెడ్డిల‌నూ మంత్రి ప‌ద‌వుల నుంచి తొల‌గించాలి. దేవుడి భూముల‌ను తాక‌ట్టు వంద‌ల కోట్ల రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల‌కు త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించి కోట్ల రూపాయ‌ల రుణం తీసుకున్నందుకు సిబిఐ విచార‌ణ‌కు ఆదేశించాలి. ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది ఉంటే సిబిఐ విచార‌ణ చేప‌ట్టాలి. కేసీఆర్ ఆక్ర‌మాల‌పై కేంద్ర హోం స‌హ‌య శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి కి ఫిర్యాదు చేస్తా. త్వ‌ర‌లో ప్ర‌జా సంఘాల‌తో ఆ భూముల‌ను ప‌రిశీలించ‌డానికి వెళ్లాం. దేవ‌దాయ భూముల ఆక్ర‌మ‌ణపై బిజెపి నేత‌లు స్పందించాలి.' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈటెల రాజేందర్ కు ఎవరైతే భూములు కొనుగోలు చేసి పెట్టారని ఆరోపణలు చేస్తున్నారో ఆ వ్యక్తి నుంచే కెటీఆర్ దేవరయాంజాల్ లో భూములు కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story
Share it