కెటీఆర్ ఫోటో....ఆసక్తికరం
తెలంగాణ సర్కారు ఇప్పుడు రాష్ట్రమంతటా కలిపి ఏకంగా 33 వేల ఎకరాల భూముల అమ్మకానికి రెడీ అయింది. తొలి విడతలో హైదరాబాద్ లో అత్యంత కీలకమైన, విలువైన భూములను అమ్మకానికి పెట్టింది. తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా అమ్మకాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. విచిత్రం ఏమిటంటే ప్రతి పార్టీ కూడా అధికారంలో ఉంటే ఓ మాట..అపొజిషన్ లో ఉంటే ఓ మాట. దీనికి సంబంధించి ఆసక్తికరమైన ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే ఒకప్పుడు..ప్రస్తుత మంత్రి కెటీఆర్ ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డు పట్టుకున్న ఫోటో ఇది. అందులో నినాదాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి.
ప్రభుత్వ భూముల వేలం పాట ఆపాలి..ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకోవాలి అని రాసి ఉంది. అయితే అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో లేదు. ఇప్పుడు అధికారంలో ఉంది. అయితే తప్పు అన్పించింది మాత్రం ఇప్పుడు ఏ మాత్రం తప్పు అన్పించటం లేదు. పైగా భూముల అమ్మకం విషయం మేం అసెంబ్లీలో చెప్పాం..కాబట్టి అమ్మటం తప్పేమీ కాదంటున్నారు మంత్రి హరీష్ రావు. విచిత్రంగా అప్పుడు భూములు అమ్మిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం భూములు అమ్మవద్దు అంటోంది.