Telugu Gateway
Politics

కెటీఆర్ ను కాబోయే సీఎంగా సంభోదించిన డిప్యూటీ స్పీకర్

కెటీఆర్ ను కాబోయే సీఎంగా సంభోదించిన డిప్యూటీ స్పీకర్
X

గత కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్ నేతలు వరస పెట్టి సీఎంగా కెటీఆర్ అంటూ జపం చేస్తున్నారు. ఇందులో మంత్రులు..ఎమ్మెల్యేలే కాకుండా ఇతర నేతలు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో పద్మారావు మాట్లాడుతూ.. కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పద్మారావు ప్రకటించారు.

త్వరలోనే ఆయన సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే కార్మికుల సమావేశంలో తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ సమక్షంలోనే పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజ‌న‌ల్ కార్యాల‌య ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో పద్మారావు , మంత్రి కేటీఆర్ కూడా హాజ‌ర‌య్యారు.

Next Story
Share it