మల్లు భట్టివిక్రమార్క మంచోడు
రేవంత్ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిది
నేను హూజూరాబాద్ ప్రచారానికి వెళ్ళటం లేదు
కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి సందర్భాన్ని బట్టి ఉంటుంది
మంత్రి కెటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణ సర్కారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గానికి చెందిన చింతకాని మండలంలో దళిత బంధు అమలుకు వంద కోట్ల రూపాయలు కేటాయించిది. అధికార పార్టీ నేతలకు మాత్రమే ఏభై కోట్ల రూపాయలు కేటాయించారు.. ఇది సోమవారం నాడు జరిగింది. మంగళవారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ మల్లు భట్టివిక్రమార్కపై చాలా సానుభూతి చూపిస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని కితాబు ఇచ్చారు. కాంగ్రెస్ లో భట్టి మాట నెగ్గట్లేదు. గట్టి అక్రమార్కులదే నెగ్గుతోంది అంటూ వ్యాఖ్యానించారు. కెటీఆర్ మంగళవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇదే కెసీఆర్ అసెంబ్లీలో కొద్ది కాలం క్రితం మల్లు భట్టివిక్రమార్కపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఆయనకు అటు కెసీఆర్, ఇటు కెటీఆర్ లు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతే కాదు..కెటీఆర్ ఓ అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి తన సామర్ధ్యం నిరూపించుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన పీసీసీ అయ్యాక వచ్చిన తొలి ఎన్నిక హుజూరాబాద్ అని...ఎందుకు ఆయన హుజూరాబాద్ వెళ్ళటంలేదని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ కోసమే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టిందని ఆరోపించారు. రేవంత్ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. కెటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'కరోనా వల్ల పార్టీ కార్యక్రమాలు కూడా స్తబ్దుగా మారాయి. వాక్సినేషన్ 93 శాతం పూర్తయ్యింది. కరోనా ప్రభావం తగ్గడం తో పార్టీ కార్యక్రమాల్లో జోరు పెంచాం. ..తొమ్మిది నెలల పాటు రకరకాల పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ అధ్యక్షుడి గా కెసీఆర్ ను ప్రతిపాదిస్తూ ఇప్పటికే పది సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 24 న తెలంగాణ భవన్ లో ఉంటుంది. 25 న ప్లీనరీ హైటెక్స్ లో ఘనం గా నిర్వహిస్తున్నాం. 27 న తెలంగాణ విజయ గర్జన సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఉంటాయి. వరంగల్ లో ఎన్నో సభలు పెట్టి విజయవంతం చేశాం. మాకు వరంగల్ కలిసొచ్చిన ప్రాంతం. తెలంగాణ విజయ గర్జన గొప్ప సభల్లో ఒకటిగా మిగిలి పోతుంది. ఆర్టీసీ బస్సు లను ఆరు వేల వరకు వినియోగిస్తున్నాం. గ్రామ పంచాయతి డివిజన్లు సహా మొత్తం 16 వేల యూనిట్ల నుంచి వాహనాల్లో సభకు జనం వస్తారు. నవంబర్ 15 న ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది.. ఆరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నా. మా పథకాలను కేంద్రం అనుకరించి అమలు చేస్తోంది. ప్రభుత్వానికే ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల పార్టీ కార్యక్రమాలు కొంత తగ్గాయి.. ఇపుడు పెంచుతున్నాం. ల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. హుజురాబాద్ లో వంద శాతం విజయం సాధిస్తున్నాం. గార్జున సాగర్ లో జానా రెడ్డి నే ఓడించాం. రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా. .బీజేపీ ని ఈటెల, ఈటెల బీజేపీ ని సొంతం చేసుకోవడం లేదు. జై ఈటెల అంటున్నరు తప్ప జై శ్రీరామ్ అని ఎందుకనడం లేదు. బీజేపీ అంటే ఓట్లు పడవనే ఈటెల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదా. రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పడం లేదు. గెలిస్తే ఏం చేస్తాడో చెప్పక వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. జూరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఈటెల రేవంత్ కుమ్మక్కయ్యారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు కానీ రేవంత్ ముందస్తు ఎన్నికల గురించి చిలక జోస్యం చెబుతున్నాడు. బలమైన అభ్యర్థిని కావాలనే కాంగ్రెస్ దింప లేదు. డంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి చేయలేదు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే.
నేను హుజూరాబాద్ ప్రచారానికి వెళ్ళటం లేదు. పశ్చిమ బెంగాల్ లో మమత గెలిస్తే మోడీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా. తాను గెలిస్తే కెసీఆర్ అసెంబ్లీ కి రావద్దని రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దళిత బంధు ను కొన్ని రోజులు ఆపగలరేమో.. నవంబర్ 3 తర్వాత ఆపగలుగుతారా. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం సమయం సందర్భాన్ని ఉంటుంది. నేను వేరే వారి లాగా చిలుక జోస్యం చెప్ప లేను. ప్రజా ఆలోచనకు హుజురాబాద్ ఉప ఎన్నిక కచ్చితంగా ప్రతిబింబమే. సీఎం ప్రచారం కూడా ఇంకా ఖరారు కాలేదు. రేవంత్ ఈటెల తదితరులు టీ ఆర్ ఎస్ పై కుట్ర కు తెరలేపారు.. ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటెల కు ఓటయ్యాలని లేఖ రాయడం ఏమిటీ. హుజురాబాద్ కచ్చితంగా చిన్న ఎన్నిక. ప్రాంతీయ పార్టీ లు ఇరవయ్యేళ్లు మనగలడం గొప్ప విషయం. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కేసీఆర్ పెట్టిన టీ ఆర్ ఎస్ లే ముందుకు సాగుతున్నాయి. నవంబర్ 15 తర్వాత నాతో పాటు కొంత మంది టీ ఆర్ ఎస్ నేతలు తమిక నాడు వెళ్తున్నాం అన్నా డీఎంకె పార్టీ సంస్థాగత నిర్మాణం పరిశీలిస్తాం. కేసీఆర్ ఎంతో మంది లీడర్లను తయారు చేశారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం. టీ ఆర్ ఎస్ లో నియోజక వర్గాల్లోగ్రూపులు పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనం. అన్నిటిని అధిగమిస్తాం. నియోజక వర్గ నేతలతో జరుగుతున్న మీటింగుల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ కు తెలియజేస్తా.' అని వ్యాఖ్యానించారు.