Telugu Gateway
Politics

కెటీఆర్ ప్రచారం అంతా ఈవెంట్ మేనేజర్లతోనే

కెటీఆర్ ప్రచారం అంతా ఈవెంట్ మేనేజర్లతోనే
X

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెటీఆర్ ప్రచారం అంతా ఈవెంట్ మేనేజర్స్ తోనే సాగుతుందని అన్నారు. ఎప్పుడైనా మున్సిపల్ శాఖ పనుల మీద తమకు కావాల్సిన అంశాల పై ముఖ్యమంత్రి ని కేటిఆర్ కలిసాడా..? కేటిఆర్ జీవితం మొత్తం నటనే అని విమర్శించారు. 'మేయర్ మాకివ్వండి లేకుంటే ..నా పార్లమెంట్ పరిధిలో కనీసం 25 - 30 కార్పొరేటర్లు గెలిపించి ఇవ్వండి.. ప్రజల పక్షాన నేను పోరాడుతా.జీహెచ్ఎంసి ఎన్నికల్లో గల్లీలు, బస్తీల సమస్యలు చర్చకు వస్తాయని కాంగ్రెస్ భావించింది. రెండు మతాల మధ్య చిచ్చు రేపే విధంగా చేశాయి. 2014 తరువాత హైదరాబాద్ అభివృద్ధి కి 67 వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు. 2016 లో లక్ష బెడ్ రూమ్ ఇల్లు,సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు ,నగర శివారు లో రవాణా వ్యవస్థ లాంటివి చేస్తా అని హామీ ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి నెరవేరలేదు.మేనిఫెస్టో వెబ్ సైట్ నుండి తొలగించారు. కరోనా సమయంలో సరైన వసతులు కల్పించలేదు. మైనార్టీ ఓట్లు గంప గుత్తగా ఎంఐఎం కు పడే విధంగా బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుంది.

పదే పదే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముస్లింలలో ఒక అభద్రత భావాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ముస్లింలు ఎంఐఎం ను ఓడించాలనుకున్న బీజేపీ చేష్టలకు విధిలేని పరిస్థితుల్లో ముస్లిం ఓట్లు మళ్ళీ ఎంఐఎం కె వెళ్తాయి. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సచివాలయంలో నల్ల పోచమ్మ ఆలయాన్ని కులగొడితే బీజేపీ ఎందుకు మాట్లాడలేదు. నన్ను కొట్టడానికి ఢిల్లీ నుండి ఇంతమంది వస్తారా అని కేసీఆర్ అంటున్నారు..పామును పెంచినట్టు బీజేపీ పక్కలో చెరావు. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచి 19 మందిలో 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నావ్, ఎమ్మెల్సీలను సర్పంచి లను నాయకులను అందరిని తీసుకొని బలహీన పరిచేలా చేశావ్. కాంగ్రెస్ ను బలహీన పర్చడం వల్ల తెలంగాణ లో బీజేపీ చొచ్చుకు వస్తుంది ఇది నీ పాపం కాదా...? ఇది మీకే కాదు తెలంగాణ మొత్తం ప్రమాదం లో పడింది. వరదల్లో పంచిన డబ్బుల్లో 400 కోట్లు టీఆర్ఎస్ నాయకులు మెక్కారు.ఈ సమయంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే కేసీఆర్ విష ప్రచారం చేశారు.. బీజేపీ నాయకులను చూసి జాలిపడుతున్నా. హైదరాబాద్ ప్రజలను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని హక్కు మాకే ఉంది... హైదరాబాద్ లో ప్రతి అభివృద్ధి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న జీహెచ్ఎంసి 700 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ కాంగ్రెస్ అప్పగిస్తే ఈరోజు జీహెచ్ఎంసి అప్పుల పాలు చేసింది' అని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

Next Story
Share it