రేవంత్ కు చిప్ దొబ్బింది..ఆ బిజెపి ఎంపీ మనిషా..పశువా?
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బిజెపి ఎంపీ దర్మపురి అరవింద్ పై ఆయన మండిపడ్డారు. వీరు గతంలో చేసిన విమర్శలకు ఘాటైన వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..'మాకు బాస్ లు గుజరాత్ లో లేరు. ఢిల్లీలో లేరు. మేం ఎవరికీ భయపడేది లేదు. మోడీకి..సోనియాకి భయపడేది లేదు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది ఈ గులాబీ జెండా మాత్రమే. యాసంగిలో పండే వరి ధాన్యం సంగతి తేల్చండి అంటే ఒక బిజెపి ఎంపీ ఉన్నాడు. వాడు అంటాడు..కెసీఆర్, కెటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు. దివానా గాడు. వాడు మనిషా..పశువా? వాడిని ఏమనాలి నాకు అర్ధం కాదు. బియ్యం స్మగ్లర్లా?. ఏమైనా తెలివుందా..మెదడు మోకాళ్ళలోకి జారిందా?. లేకపోతే నెత్తిమొత్తం ఖరాబైందా?. ఏమి మాట్లాడుతున్నారు నాకు అర్ధం కాదు. ఇంకొడు ఉన్నడు ఇక్కడ. పీసీసీ చీప్. చీఫ్ కాదు..చీప్. తెలిసే మాట్లాడినా. చీప్ అని ఎందుకు మాట్లాడినా అంటే నేను అనలా..వాళ్ల పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన చెబుతుండు. వీడు చాలా చిల్లరగాడు.మా అలిండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ ఛార్జి ఉన్నాడు ఇంకో చిల్లరగాడు. ఈ చిల్లరగాడు పోయి 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు అని ఆయన చెప్పాడు. మరి వాడిని చీఫ్ అనాలా..చీప్ అనాలా? వాడిది ఎంత దిమాఖ్ ఖరాబ్ అయిందంటే ..ఏమి మాట్లాడుతాడు.
మనం కొత్త సెక్రటేరియట్ కడతాం అంటే..కింద నేళమాలిగలు ఉన్నాయి..ప్రగతి భవన్ నుంచి కెసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకుపోతున్నాడు అంటాడు. కొత్త సెక్రటేరియట్ లో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళే కూర్చుంటారు. కెసీఆర్ కు అది ఏమీ పర్మినెంట్ కాదుగా. అందమైన సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం ఔన్నత్యం పెరుగుతుందని మన ఆలోచన. వాడికి నెత్తి ఉందా..చిప్ ఉందా దొబ్బిందా. నేళమాలిగలు కెసీఆర్ సొరంగం కింద తీసుకుపోతుండంట.మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్ టైమ్ వచ్చింది. పది వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటాడు. అసలు మనం కొన్నది ఎక్కడ?. మనం ఖర్చు పెట్టిందే వందల కోట్లు వ్యాక్సిన్ పై . దేశం అంతా తిరగబడేలా ఉన్నారని వాళ్ళే మేం ఇస్తామన్నారు చివరకు. ఇవాళ మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటాడు. అది బయటపడతదని టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లొల్లి పెట్టారంట. నిన్న కేశరావు చెప్పాడు వాడో దివానాగాడు..పిచ్చోడు అని. నేను మళ్లోకసారి చెబుతున్నా. నాట్లు వేసే టైమ్ కాబట్టి యాసంగిలో వరి పండియ్యాలా వద్దా అని చెప్పమంటే..తేల్చరా మగడా అంటే పియూష్ గోయెల్, కిషన్ రెడ్డిలు ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తాం అని చెబుతారు. ఎవడైనా ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తాడా? కొంటే వరి వేస్తం లేకపోతే వేయం.అంతే కదా సింపుల్ లెక్క. ఇది చెప్పరా అంటే ఫిబ్రవరిలో చెబుతాం అని ఒకడు..టీఆర్ఎస్ వాళ్లు అజీర్తి అయి ధర్నా చేస్తున్నారు అని ఒకడు మాట్లాడుతున్నారు.' అంటూ వ్యాఖ్యానించారు.