Top
Telugu Gateway

అందరూ కరోనాపై పోరాడుతుంటే కెసీఆర్...!

అందరూ కరోనాపై పోరాడుతుంటే కెసీఆర్...!
X

పాత ఆరోగ్య మంత్రితో కొత్త ఆరోగ్య మంత్రి భూ పంచాయతీలు

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫేస్ బుక్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందరూ కరోనాతో పోరాటం చేస్తుంటే తెలంగాణ సీఎం కెసీఆర్ మాత్రం భూ పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. ఫేస్ బుక్ లో కొండా పెట్టిన పోస్ట్ ఇదే..'మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించని ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశమంతా కరోనాతో పోరాటం చేస్తుంటే...టి.ఆర్.ఎస్. ప్రభుత్వ కొత్త ఆరోగ్య మంత్రి, పాత ఆరోగ్య మంత్రితో భూమి విషయంలో పోరాడుతున్నడు. ప్రజలకు మీ భూమి పంచాయతీ మీద ఇంట్రెస్ట్ లేదు.

దయచేసి ప్రజల ప్రాణాలను కాపాడటం మీద మీరు శ్రద్ధ పెట్టాలి. మీ రాజకీయ పగలు, ద్వేషాలు ఇప్పుడు పక్కకు పెట్టండి. కోవిడ్ ని ఎదుర్కొని, ప్రజల ప్రాణాలు కాపాడండి. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదలువెట్టిన ఆరోగ్య శ్రీ లో కోవిడ్ చికిత్సను చేర్చండి. ఇది రాజకీయాలను పక్కకు వెట్టి పని చెయ్యాల్సిన సమయం. మేము కూడా రాజకీయాలకు అతీతంగా మీకు మద్దతు ఇస్తం' అని ప్రకటించారు.

Next Story
Share it