కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయాల గురించి మాట్లాడనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలుపు ఖాయమన్నారు. సోమవారం నాడు ఆయన నాగార్జున సాగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ఉపఎన్నిక కోసమే కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఐకేపీ సెంటర్లను మూసివేస్తే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను రైతులు ఉరికించి కొడతారన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ తరహాలో అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ అవినీతిపై బీజేపీ పార్టీ రాజీపడ్డా తాము మాత్రం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. యాదగిరిగుట్టలో నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. మూడేళ్ళుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేక వేల స్కూళ్లు మూతపడ్డాయన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ కాదా అంటూ ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి ప్రశ్నించారు.