Telugu Gateway
Politics

ప‌ద‌వి రాలేద‌నే అలా అన్నా

ప‌ద‌వి రాలేద‌నే అలా అన్నా
X

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఇటీవ‌ల‌ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ పై చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించి వివ‌ర‌ణ ఇచ్చారు. ఆయ‌న గురువారం వాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. త‌న‌కు పీసీసీ ప‌ద‌వి రాలేద‌నే ఆవేద‌న‌తో అలా మాట్లాడాన‌న్నారు. అంతే త‌ప్ప వేరే ఉద్దేశంలేద‌ని తెలిపారు. అన్ని అర్హ‌త‌లు ఉన్నా కూడా ప‌ద‌వి ఇవ్వ‌కుంటే బాధ ఉంటుంద‌ని పేర్కొన్నారు. '' చాలా పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా పోలేదు. నాకు పార్టీ మారే అవసరం లేదు.

నాకు కొత్త గ్రూపులు కట్టే అవసరం అంత‌కంటే లేదు. నాకు ఏ పదవి అవసరం లేదు. గాంధీ భవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్‌లు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం'' అని అన్నారు. కెసీఆర్ ను ఓడించాలంటే అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బుధ‌వారం నాడు జ‌రిగిన రేవంత్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి కూడా కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ దూరంగానే ఉన్నారు.

Next Story
Share it