తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి

కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్ గా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు. ఈ మేరకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె సీ వేణుగోపాల్ పేరుతో ప్రకటన వెలువడింది. పీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కిన వెంటనే ఆయనపై తీవ్ర విమర్శలు చేసి సంచలనం రేకెత్తించారు. తాజాగా రాహుల్ గాంధీతో భేటీ అనంరతం తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరూ ఒకే మాటపై నిలబడి పోరాడాలని నిర్ణయానికి వచ్చినట్లు కన్పిస్తోంది. అందులో భాగంగానే సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ గా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఉన్నారు.