Telugu Gateway
Politics

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

టీపీసీసీ రేసులో చివ‌రికంటూ నిలిచిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం శ‌నివారం సాయంత్రం ఈ ప‌ద‌విలో మ‌రో ఎంపీ రేవంత్ రెడ్డి నియ‌మించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టీపీసీసీ ఇప్పుడు టీడీపీ పీసీసీగా మారిపోయింద‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న నేత‌ల‌ను కాద‌ని రేవంత్కి ప‌ద‌వి ఇవ్వ‌టంపై ఆయ‌న మండిప‌డ్డారు. ఇక‌పై గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌న‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ ఈ ప‌ద‌విని అమ్ముకున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త్వ‌ర‌లోనే ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. సోనియా, రాహుల్ గాంధీల‌పై విమ‌ర్శ‌లు చేయ‌ను.

త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ను ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని తెలిపారు. టీడీపీ నేత‌లు ఎవ‌రూ త‌న‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌న్నారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పిసిసి ఎన్నిక జరిగినట్టు తనకు డిల్లీ వెళ్ళాక తెలిసిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో స‌హా ఎవ‌రూ త‌న‌ను క‌ల‌వొద్ద‌ని తెలిపారు.. హూజురాబాద్ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు అయినా తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. రేపటి నుండి ఇబ్రహింపట్నం నుండి మొదలు పెట్టుకుని భువనగిరి వరకు పాదయాత్ర చేస్తా. ప్రజల మధ్యనే ఉంటా కొత్త నాయకులను కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తా..నల్గోండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల గెలుపుకోసం కృషి చేస్తా.పార్లమెంట్ లో నా గళం వినిపిస్తాన‌న్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Next Story
Share it