Telugu Gateway
Politics

ఎన్టీఆర్ తో మాకేమి సంబంధం

ఎన్టీఆర్ తో మాకేమి సంబంధం
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని మ‌రోసారి తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌నను ఎలాగూ ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌నే ఉద్దేశంతోనే చంద్ర‌బాబు ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని వివాదాల్లోకి లాగుతున్నార‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ త‌న సినిమాలు ఏదో తాను చేసుకుంటున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఎందుకు వివాదంలోకి లాగుతున్నారని..ఆయ‌న‌కూ త‌మ‌కు ఏమి సంబందం ఉంద‌ని ప్ర‌శ్నించారు. ఓకే తాము ఎన్టీఆర్ శిష్యుల‌మే అనుకుందాం..మ‌రి చంద్ర‌బాబు పెంచిపోషించిన వారిలో చాలా మంది ఆయ‌న్ను ఇప్పుడు దారుణంగా బూతులు తిడుతున్నార‌ని..వారంద‌నీ చంద్ర‌బాబు ఎందుకు నియంత్రించ‌లేక‌పోతున్నార‌ని కొడాలి నాని ప్ర‌శ్నించారు. ఆయ‌న గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. త‌మ‌కూ, జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేద‌ని..ఒక‌ప్పుడు క‌ల‌సి ఉన్నామ‌ని..త‌ర్వాత విభేదాల‌తో ఎవ‌రిదారి వారు చూసుకున్నామ‌న్నారు. తాము ఏమైనా ఆయ‌న దగ్గ‌ర న‌ట‌న నేర్చుకుంటున్నామా. లేక ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేస్తున్నామా అని ప్ర‌శ్నించారు.

ఇప్పుడు జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తున్నాన‌ని తెలిపారు. వ‌ర్ల రామ‌య్య వంటి వాళ్లు చేసిన విమ‌ర్శ‌ల‌కు కూడా తాను స‌మాధానం చెప్పాలా అని ప్ర‌శ్నించారు. వ‌ర‌ద స‌హాయ‌క ప‌నుల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారన్నారు. చంద్రబాబు అస‌త్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం భార్యను రోడ్డు మీదకు తెచ్చిన ఘనత చంద్రబాబుదే. ఆయన రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారన్నారు. ''రాజకీయ అవసరాల కోసం భార్యను రోడ్డు మీదకు తేవడం అన్యాయం. చంద్రబాబు మాదిరిగానే లోకేష్‌ వ్యవహరిస్తున్నారు. ఏదోలా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు తాపత్రయం. చంద్రబాబు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వదిలేసి కుంటిసాకులతో బయటకెళ్లిపోయారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి భువనేశ్వరి పరువు దిగజార్చారు. వరదల్లో బాధితుల పరామర్శకు వెళ్లి.. నన్ను అవమానించారంటూ చంద్రబాబు ఏడుస్తున్నారని'' మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌లు వారి క‌ష్టాల్లో వాళ్లు ఉంటే చంద్ర‌బాబు న‌న్ను తిట్టారు..నా భార్యను తిట్టారు అని ఏడ‌వ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రిపై ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌లేద‌ని మ‌రోసారి తెలిపారు.

Next Story
Share it