Telugu Gateway
Politics

టీడీపీలో 'అచ్చెన్నాయుడి' వీడియో కలకలం

టీడీపీలో అచ్చెన్నాయుడి వీడియో కలకలం
X

తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యధర్శి నారా లోకేష్ ల మధ్య విభేదాలు ఉన్నాయా?. అచ్చెన్నాయుడికి పదవి ఇచ్చిన తర్వాత నుంచే నారా లోకేష్ ఫుల్ యాక్టివ్ అయ్యారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఉగాది రోజు..మంగళవారం నాడు సోషల్ మీడియాలో అచ్చెన్నాయుడి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ప్రధానంగా చర్చ అంతా నారా లోకేష్ పైనే సాగింది. ఓ వ్యక్తి ఆర్ధిక వ్యవహారాలపై అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేస్తుంటే ... 'ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు' అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ ఇప్పుడు అదే సమస్యగా మారిందని అన్నారు. అంతే కాదు..అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేసే వ్యక్తి నారా లోకేష్ ఉన్నంత కాలం పార్టీకి భవిష్యత్ లేదని..ఈ విషయాన్ని తాను బాలకృష్ణకు కూడా చెప్పినట్లు వ్యాఖ్యానించారు.

ఈ మాటలను కూడా అచ్చెన్నాయుడు వింటూ ఊరుకున్నారు. అంతే కాదు..గతంలో లోకేష్ తనను అన్నా అన్నా అని పిలిచేవాడని..కానీ ఇప్పుడు మాత్రం అక్కడ కూర్చోమ్మా అంటూ మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో వ్యవహారంపై అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తప్పుడు వీడియోలు అని ఆరోపించారు. టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో తిరుప‌తి ఎన్నిక‌కు ఐక‌మ‌త్యంగా ప‌నిచేస్తుండ‌డంతో వైసీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందని. నారా లోకేష్ విసిరిన స‌వాల్‌కి తోక‌ముడిచావంటూ విమర్శలు గుప్పించారు. నకిలీ సంభాషణలు సృష్టించారు అంటూ విమర్శించారు.

Next Story
Share it