లాక్ డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు
కేంద్రం నిపుణుల సూచనలను పెడచెవిన పెడుతోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి లాక్ డౌన్ పెట్టాలన్న ప్రతిపాదనలపై ప్రధాని నరేంద్రమోడీ అసలు మాట్లాడమేలేదు. దీంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఒక్క రోజే అంటే గురువారం నాడు కేరళ, మధ్యప్రదేశ్ లు తమ తమ రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు వెల్లడించాయి.కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ ను తప్పనిసరి పరిస్థితుల్లో విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు.
'కరోనా చెయిన్ తెంపేందుకు మే 15వ తేదీ వరకు కఠినంగా జనతా కర్ఫ్యూ రాష్ట్రంలో విధిస్తున్నాం' అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. చాలా రోజులు లాక్‌డౌన్ ఉండదని పాజిటివిటీ రేటు తగ్గేంతవరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు 18 శాతం ఉండేలా చూస్తామన్నారు. కేరళలో ఏప్రిల్ 8 నుంచి 16వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు కానున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.