దేశం నుంచి మోడీని తరిమేస్తాం
జాగ్రత్త నరేంద్రమోడీ అంటూ హెచ్చరికలు
మీరు దీవిస్తే ఢిల్లీ కోట బద్దలు కొడతాం
జనగామ బహిరంగ సభలో కెసీఆర్
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ జనగామ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం నుంచి మోడీని తరిమేస్తామని హెచ్చరించారు. తమకు అన్నీ ఇచ్చేవాళ్లను తెచ్చుకుంటామన్నారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంతో ఎప్పుడూ పంచాయతీ పెట్టుకోలేదన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయాల్సిన అవసరం వస్తే చేస్తాం. జాతీయ రాజకీయాల్లో పోరాడదామా..వెళదామా ? అని బహిరంగ సభలో ప్రజలను అడిగారు. ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి రెడీ. జాగ్రత్త నరేంద్రమోడీ అంటూ హెచ్చరించారు. ఇది తెలంగాణ ..పులిబిడ్డ. నీ ఉడత ఊపులకు భయపడేవాడు ఎవడూ లేడు. బిజెపి బిడ్డళ్లారా.. మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం. మా బలం..ముందు మా శక్తి ఊదితే అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి..మా జాగ్రత్తలో మేం ఉంటాం. దేశంలో నరేంద్రమోడీ రైతుల వెంట..పేదల వెంట పడ్డారని మండిపడ్డారు. పొలాల దగ్గర మీటర్లు పెట్టమంటే పెట్టం ఏమి చేసుకుంటావో చేసుకో పో అన్నాం.
అవసరం అయితే తాము ఇచ్చుకుంటాం మీకేంటి బాధ అంటూ ప్రశ్నించారు. సిద్ధిపేట వాళ్ళు తనను పంపిస్తే పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఇప్పుడు మీరు పంపిస్తే ఢిల్లీలో పోతామన్నారు. జనగామ టౌన్ లో పిడికెడు లేని బిజెపి వాళ్లు టీఆర్ఎస్ వాళ్లను కొట్టినట్లు పత్రికల్లో వచ్చిందని..తాము తలచుకుంటే వాళ్లు ఉండరన్నారు. ప్రజలు దీవిస్తే ఢిల్లీ కోట బద్ధలు కొట్టడానికి రెడీగా ఉన్నామన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ఏమి అడిగినా కేంద్రం ఇవ్వటంలేదన్నారు. చాలా రాష్ట్రాల కంటే తాము ముందు వరసలో ఉన్నామని..ఇంకా ముందుకెళ్లేందుకు రెడీగా ఉన్నారు. దేశం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు దొంగలకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. బ్యాంకులను కొల్లగొట్టిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను బయటకు ఎవరు పంపించారని ప్రశ్నించారు