కెసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్
టీఆర్ఎస్ ఎల్ బీ స్టేడియం సమావేశంపై బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ స్పందించారు. సీఎం కెసీఆర్ మాటల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. కెసీఆర్ సభలో పస లేదని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ తప్పతాగి ఫాంహౌస్‌లో పడుకున్నారని.. అందుకే ఢిల్లీ నుంచి తమ నాయకులు వస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచి కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. లక్ష మందితో సభ అన్నారు ఏమైందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సభ అట్టర్ ప్లాప్ అని ఎద్దేవా చేశారు. ''మూసి ప్రక్షాళన కాదు కేసీఆర్ నోరు ప్రక్షాళన చేయాలి. మాది గల్లీ నుంచి ఢిల్లీకి విస్తరించిన పార్టీ' అని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ టీఆరెస్ బహిరంగ సభ హౌస్ ఫుల్ కలెక్షన్స్ లేకుండా పేలవంగా ముగిసిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతల్లో బీజేపీ భయం పట్టుకుందన్నారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్....వాడు వీడు అని వ్యాఖ్యలు చేశారు. 'పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను పట్టుకొని కనీస గౌరవం లేకుండా వాడు వీడు అనే సంస్కృతి కేసీఆర్ ది. ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగూ భరోసా ఇవ్వడు.
కేంద్ర మంత్రులు- పక్క రాష్ట్ర సీఎంలు వస్తే విమర్శలు చేస్తారా? కరోనా సమయంలో కేసీఆర్ ఒక్క హాస్పిటల్ అయినా తిరిగిండా? వరదలప్పుడు కేసీఆర్ బయటకు రాడు కానీ..ప్రధానిమోడీ రావాలా? భారత్ బయోటెక్ హైదరాబాద్ లోనే ఉంది కదా...ఒక్కసారైనా కేసీఆర్ వెళ్లిండా? ఎందుకు పోలేదు? కాషాయ వస్త్రాలు వేసుకున్న స్వామీజీ యూపీ సీఎం..ఆయన్ని తిడుతావా? బీజేపీ మ్యానిఫెస్టో చదివిన టీఆరెస్ నేతలు..వాళ్ళ గత ఎన్నికల మ్యానిఫెస్టో ఎందుకు చదవలేదు? బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తరించిన పార్టీ..టీఆర్ఎస్ లో కేటీఆర్-కేసీఆర్ తప్ప మరో వ్యక్తి లేరు. టీఆర్ఎస్ మంత్రులు-ఎమ్మెల్యేలు భాధపడుతున్నారు...ఎన్నికల్లో కేటీఆర్-కేసీఆర్ ఫోటోలు తప్ప ఒకొక్కరిది లేదు!.టీఆర్ఎస్ ప్రభుత్వ ఏ సమయంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది. కేంద్రం వెల్ నెస్ సెంటర్లకు ఇచ్చిన నిధులు దారి మళ్లించి బస్తీ ధవాఖాలు అంటున్నారు. గొర్రెల- బర్రెలు పేరుతో యాదవుల నుంచి పైసలు తీసుకొని వాడుకున్నారు.
పాతబస్తీ మెట్రోను అడ్డుకుంది కేసీఆర్ కాదా? పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయరు?. వరద నష్టం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందా? కేంద్రం రూపాయి ఇవ్వలేదని ప్రమాణం చేద్దామా?. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కేసీఆర్ సభలో మాట్లాడారు!- మహిళలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే. సేవ్ హైదరాబాద్ కాదు....సేవ్ కేసీఆర్ కుటుంబం అని చెప్పు. గల్లీకే పనికిరాని కేసీఆర్...ఢిల్లీకి పనికి వస్తారా? సీఎం గా ఉండి సెక్రటేరియట్ పోలేదు...ఢిల్లీ కి పోతారా?. కేసీఆర్ గల్లీలో ఉంటే రాష్ట్రంలో ఎమ్ జరుగుతుందో తెలీదు!...ఢిల్లీ కి పాకిస్తాన్ చైనా వాడు వచ్చి తిష్ట వేస్తారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది..ఎక్కడైనా అల్లర్లు జరిగాయా? దేశ వ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తులను బీజేపీ కంట్రోల్ చేస్తున్నది. ఇతర రాష్ట్రాలలో అభివృద్ధి గురించి తెలంగాణను పోల్చడానికే ఇతర రాష్ట్రాల నేతలు హైదరాబాద్ వస్తున్నారు.' అని తెలిపారు.