కర్ణాటక సీఎం రాజీనామా తప్పదా?!

ప్రధాని నరేంద్రమోడీతో శుక్రవారం రాత్రి కర్ణాటక సీఎం యడ్యూరప్ప సమావేశం తర్వాత ఒక్కసారిగా ఆయన రాజీనామా వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాదు..రాజీనామా చేయటానికి యడ్యూరప్ప కూడా అంగీకరించారని..అయితే దీనికి ఆయన కొన్ని షరతులు పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యడ్యూరప్ప వ్యతిరేక వర్గీయులు అయితే రాజీనామా అయితే తప్పదని అని తేల్చిచెబుతున్నారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. పరిశీలకులు వచ్చి వెళ్లి అంతా బాగానే ఉందన్నారు.
అంతే కాదు సీఎం మార్పు ఏమీలేదంటూ ప్రకటించిన తర్వాత కూడా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం అయి తన షరతులను వవివరించినట్లు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వంలో యడియూరప్ప తన కుమారులకు ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రచారంపై స్పందించిన యడియూరప్ప రాజీనామా ప్రచారాన్ని ఖండించారు. ఆయన వ్యతిరేకులు మాత్రం యడ్యూరప్ప మార్పునకు రంగం సిద్ధం అయిందని అంటున్నారు.