చంద్రబాబు డైరక్షన్ లో లోకేష్ యాక్షన్
తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ పై మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. ఎలా అల్లరి చేయాలో లోకేష్ కు తండ్రి చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నట్లుందని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏడు నెలల కిందట జరిగిన సంఘటనలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిదో అందరికీ తెలుసన్నారు. తండ్రి స్క్రీన్ ప్లేలో లోకేశ్ నటిస్తున్నాడని కన్నబాబు విమర్శించారు. మహిళల భద్రతలో ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని తెలిపారు. టీడీపీలో కూడా లోకేశ్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని చెప్పారు. అందుకే ఇలాంటి డ్రామాలు అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి బస్సు ప్రమాదం జరిగితే తమ నాయకుడు వెళితే కేసులు పెట్టింది ఏ ప్రభుత్వం..? రన్ వేపై నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించింది ఎవరు..? ఏం తప్పు చేశారని ఆ రోజు కాపులు కంచాలు కొట్టారని వేల మందిపై కేసులు పెట్టారు..? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పద్ధతిన జరుగుతున్న పరిపాలన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. రాజకీయంగా లోకేశ్‌ని టీడీపీలో ఆమోదం కోసం ఈ డ్రామాలన్నీ అని మంత్రి కన్నబాబు తెలిపారు. అంతకుముందు వ్యవసాయ శాఖ అభివృద్ధిపై కన్నబాబు మాట్లాడుతూ.. 'గ్రామ స్థాయి వరకు బ్యాంకింగ్ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. దానికి కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రం పురోగతి సాధించడానికి బ్యాంకర్స్ సహకారం బాగుందని సీఎం చెప్పారు.