తొలి రోజే ఈటెలకు అవమానం
బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై అధికార టీఆర్ ఎస్ విమర్శల దూకుడు పెంచింది. ఆయనకు ఢిల్లీలో తొలి రోజే అవమానం జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడం ఏంటి అని కడియం ప్రశ్నించారు. మీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ లో చేరారని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమిటని ప్రశ్నించారు. బిజెపిలో చేరిన ఈటెల వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయన్నారు. పేద ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా బీజేపీ దాడి చేసింది.అది తెలిసి కూడా బీజేపీ లో ఎలా చేరారు.
మీలో ఉన్న కమ్యూనిస్ట్ చనిపోయాడా...?ఏమి ఉద్ధరించడానికి మీరు బీజేపీ లో చేరారు. బీజేపీ లో ఈమేరకు ప్రజాస్వామ్యం ఉందని మీకు అనిపించింది.? కేసీఆర్ పై మీరు వాడిన భాష సరిగా లేదు.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న మీరు ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం ఏంటి. 5 సం క్రితమే సీఎం తో మనస్పర్థలు వస్తే ఇప్పుడు మీకు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా..దాదాపు 26 లక్షల రూపాయల రైతు బంధు తీసుకున్న మీరు రైతు బంధు గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారు. కేసులకు భయపడే మీరు బీజేపీ లో చేరారు.బీజేపీ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న పార్టీ అంటూ కడియం విమర్శలు గుప్పించారు.