Telugu Gateway
Politics

జూన్ 14న బిజెపిలోకి ఈటెల‌

జూన్ 14న బిజెపిలోకి ఈటెల‌
X

ముహుర్తం ఖ‌రారైంది. మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఈ నెల 14న ఢిల్లీలో బిజెపిలో చేర‌నున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఓ సారి బిజెపి పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు. ఇప్పుడు చేరిక‌కు రంగం సిద్ధం అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటెల బీజేపీలో చేరనున్నారు. అంత‌కు ముందే ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఉప ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌లో అటు ఈటెల‌..ఇటు టీఆర్ఎస్ లు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. అధికార టీఆర్ఎస్ ఎలాగైనా ఈటెలను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తుండ‌గా..ఆ ఛాన్స్ లేకుండా చేయాల‌ని ఈటెల త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో హుజూరాబాద్ రాజ‌కీయం అత్యంత ఆస‌క్తిక‌రంగా మార‌నుంది.

Next Story
Share it