Telugu Gateway
Politics

జో బైడెన్ పరమైన అరిజోనా రాష్ట్రం

జో బైడెన్ పరమైన అరిజోనా రాష్ట్రం
X

అమెరికా ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎప్పటినుంచో రిపబ్లిక్లకు మంచి పట్టున్న అరిజోనా రాష్ట్రం ఇప్పుడు జో బైడెన్ దక్కించుకున్నారు. దీంతో జో బైడెన్ ఎలక్ట్రోరల్ ఓట్లు 290కి పెరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం 217 ఓట్ల వద్దే ఆగిపోయారు. 1996 తర్వాత అరిజోనా రాష్ట్రాన్ని దక్కించుకున్న డెమాక్రటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ కావటం విశేషం. 1996లో బిల్ క్లింటన్ ను ఈ రాష్ట్రాన్ని దక్కించుకున్నారు. మరో వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని అంగీకరించటానికి సిద్ధంగా లేరు. ట్రంప్ పై జో బైడెన్ 11 వేల ఆధిక్యంతో ఈ రాష్ట్రాన్ని దక్కించుకున్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. ఈ పరిణామం ట్రంప్ పై మరింత ఒత్తిడి పెంచుతుందని నిఫుణులు చెబుతున్నారు. ఇంకా నార్త్ కరోలినా, జార్జియా ఫలితాలు మాత్రమే వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఇఫ్పటికే జో బైడెన్ ఇప్పటికే అవసరమైన అన్ని ఓట్లతో గెలిచినందున ఈ ఫలితాలు వెల్లడి అనేది కేవలం లాంఛనం మాత్రమే.

ఈ రెండు రాష్ట్రాలు ఒక వేళ ట్రంప్ ఖాతాలోకి వెళ్ళినా ఎలాంటి మార్పు ఉండదు. ఇదిలా ఉంటే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంత కాలం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పందించిన చైనా తొలిసారి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ కు అభినందనలు తెలిపింది. అమెరికా ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. జో బైడెన్, కమలా హ్యారిస్ కు అభినందనలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను అమెరికా చట్టాల ప్రకారం ధృవీకరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొంత కాలంగా అమెరికా, చైనాల మధ్య తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న విషయం తెలిసిందే.

Next Story
Share it