Telugu Gateway
Politics

ఏపీ లిక్కర్ స్కాం కో రూల్..ఢిల్లీ కి మరో రూల్!

ఏపీ లిక్కర్ స్కాం కో రూల్..ఢిల్లీ కి మరో రూల్!
X

రాజకీయాల్లో ఒక్కో సారి ఒక్కో సెంటి మెంట్ పని చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా జైలు కు వెళ్లి వచ్చిన కీలక నేతలు అందరూ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రులు అయ్యారు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ అంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసు లో అరెస్ట్ చేసి జైలు లో పెట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు గెలుపులో ఈ జైలు ఎపిసోడ్ కూడా కీలక పాత్ర పోషించిన వాటిలో ఒకటి గా ఉంది. గతంలో జగన్ మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా వివిధ కేసు ల్లో జైలు కు వెళ్లి వచ్చి ముఖ్యమంత్రులు అయిన వారే. తాజాగా ముగిసిన ఢిల్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం బీజేపీ కి అనుకూలంగా ఉన్నట్లు లెక్కలు వేశాయి. కొంత మంది అంటే అతి తక్కువ స్థాయిలో ఆప్ కు మెజారిటీ వస్తుంది అని తేల్చారు. ఫిబ్రవరి 8 న అసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

అయితే గతం లో ఎంతో మంది కీలక నేతలకు కలిసివచ్చిన జైలు సెంటిమెంట్ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కలిసిరాదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తర్వాత అయన తన పదవి కి రాజీనామా చేశారు. ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు..ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన మనీష్ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యయేంద్ర జైన్ కూడా అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా ఢిల్లీ లోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు అనే అనే అభిప్రాయం ఎక్కువ మంది లో ఉంది.

రాజకీయంగా తమను టార్గెట్ చేసేందుకే ఢిల్లీ లిక్కర్ స్కాం ను తెరమీదకు తీసుకువచ్చారు అని ఆప్ ఆరోపించిన సంగతి తెలిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ స్కాం జరగలేదు అని ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వరు కానీ..ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ హయాం లో జరిగిన లిక్కర్ స్కాం తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నది అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఏపీ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయం వైపు కన్నెత్తి చూడని కేంద్రం , మోడీ సర్కారు ఢిల్లీ లిక్కర్ స్కాం పై అంతగా ఫోకస్ పెట్టింది అంటే అది పూర్తి రాజకీయ కోణంలోనే అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నట్లు బీజేపీ గెలిచి ఢిల్లీ ఎన్నికల్లో జైలు సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వకపోతే ఇది కూడా ఒక కొత్త చరిత్ర అవుతుంది అనే చెప్పాలి. అయితే ఎగ్జిట్ పోల్స్ తిరస్కరిస్తున్నట్లు ఆప్ చెపుతుంటే...ఈ పోల్స్ లో చెప్పిన దానికంటే ఇంకా తమకు ఎక్కువ సీట్లే వస్తాయని బీజేపీ నేతలు చెపుతున్నారు.

Next Story
Share it