జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రం హోం సీఎంగా మారారని ఎద్దేవా చేశారు. వరదలతో ప్రజలు ఎంత కష్టాల్లో ఉంటే ఆయన మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావటం లేదన్నారు. ఏ మాత్రం పరిపాలనా దక్షతలేని సీఎంగా జగన్ ఉన్నారన్నారు. ఏరియల్ సర్వే చేసి జిల్లాకు కేవలం రెండు కోట్ల రూపాయలు కేటాయించటం దారుణమన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు మనోహర్ మంగళవారం నాడు రేణిగుంట చేరుకున్నారు.
అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్న జగన్ మాత్రం ఇల్లు కదలన్నారు. బాధ్యత కల రాజకీయ పార్టీగా ప్రజలకు అండగా నిలిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రెండవ విడత పవన్ కళ్యాణ్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు.