Telugu Gateway
Politics

జగన్ పబ్జీ ఆడుతున్నావా?

జగన్ పబ్జీ ఆడుతున్నావా?
X

ఏ2 పాదయాత్ర ఎవరికి కావాలి?

దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి ప్రైవేటీకరణ ఆపాలి

తేలు కుట్టిన దొంగల్లా వైసీపీ నేతలు

విశాఖపట్నం పర్యటన సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఎందుకు నోరుతెరవటంలేదని ప్రశ్నించారు. పోస్కో ప్రతినిధులతో సీఎం జగన్ ఫోటోలు కూడా దిగారన్నారు. సీఎంకు తెలియకుండా ప్రైవేటీకరణ వ్యవహారం సాగుతుందా? అని ప్రశ్నించారు. 'ముఖ్యమంత్రి తేలు కుట్టిన దొంగ. రేపు దొంగ స్వామిని కలవటానికి సీఎం వస్తున్నారు. విశాఖ స్టీల్ సాధిస్తావా? లేక నా వల్ల కాదు అని రాజీనామా చేసి జైలుకు పోతావో పో' అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ ఎక్కడున్నావ్.. పబ్‌జీ ఆడుకుంటున్నావా? విశాఖను దోచుకోవాలనుకుంటున్నారా? ఎందరో ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఆనాడు రైతులిచ్చిన భూమి విలువ ఇప్పుడు లక్షల కోట్లకు చేరింది. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదు. పోర్ట్ బేస్‌లో ఎక్కడా స్టీల్ ప్లాంట్ లేదు.. విశాఖలోనే ఉందన్నారు. విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తానని చెబుతున్నారని..ఏ2 పాదయాత్ర ఎవరికి కావాలన్నారు.

చేతనైతే ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణను ఆపాలన్నారు. విజయసాయిరెడ్డి సంగతి ఏంటో చూస్తామన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా శ్రీనివాస్ ఊపిరి పోశారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? 'విశాఖలో ఎయిర్‌పోర్టు, మెట్రోకు శ్రీకారం చుట్టాం. విశాఖకు ఐటీ పరిశ్రమ, లులు షాపింగ్‌మాల్ రాకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులూ ఇప్పుడు వెళ్తున్నాయి. మీరు పాలకులా? కమీషన్ ఏజెంట్లా? విశాఖ ఉక్కు సంకల్పాన్ని కొనేయాలనుకుంటున్నారా?' అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 'విశాఖ ఆత్మను అమ్మితే మీరు ఆమోదిస్తారా? విశాఖ స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా చేస్తే మీరు అంగీకరిస్తారా? ' అంటూ ప్రశ్నించారు.

Next Story
Share it