Telugu Gateway
Politics

స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటి దాడులు

స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటి దాడులు
X

ఎన్నికల వేళ తమిళనాడులో ఐటి దాడుల కలకలం. వరస పెట్టి డీఎంకె నేతల ఇళ్లపై ఈ దాడులు జరుగుతున్నాయి. శుక్రవారం నాడు స్టాలిన్ కుమార్తె ఇంటిపై దాడులు జరిగాయి. స్టాలిన్ అల్లుడికి చెందిన నాలుగు ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. నీలంగ‌రైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. స్టాలిన్ కూతురు సెంత‌మారై త‌న భ‌ర్త శ‌బ‌రీశన్‌తో పాటు అక్క‌డే నివ‌సిస్తున్నారు.

ఏప్రిల్ 6 న జరగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవ సారి.గ‌త నెల‌లో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10 కి పైగా ప్రదేశాల్లో ఐటీశాఖ సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. ప్రతిపక్షాలను బెదిరించేందుకు బీజేపీతో జతకలిసిన కూటమి పన్నిన పన్నాగమని, ఇది రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఖండించారు.

Next Story
Share it