Telugu Gateway
Politics

ఇండోనేషియా విమానం..బ్లాక్ బాక్స్ దొరికింది

ఇండోనేషియా విమానం..బ్లాక్ బాక్స్ దొరికింది
X

ప్రమాదానికి గురైన ఇండోనేషియా విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది. బ్లాక్ బాక్స్ తో ప్రమాదానికి అసలు కారణం వెలుగుచూసే అవకాశం ఉంది. శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేషియా విమానానికి సంబంధించిన రెండు బ్లాక్‌ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్‌ బట్టి వాటిని త్వరలోనే బయటికి తీస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం లాంకాంగ్‌, లకీ ద్వాపాల మధ్య విమాన భాగాలు, శకలాలు, మునుషులు శరీర బాగాలు, దుస్తులు లభ్యమవడంతో ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. విమానం నడిపిన పైలట్లు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారేనని అధికారులు తెలిపారు.

బ్లాక్‌ బాక్సులను వెలికి తీసి పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీవిజయ ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్‌ ప్రావిన్సు రాజధాని పొంటియానక్‌కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్‌ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయింది.

Next Story
Share it