Telugu Gateway
Politics

జగన్ గ్రాఫ్ తగ్గుతోంది...టాప్ టెన్ లో పత్తా లేని కెసిఆర్

జగన్ గ్రాఫ్ తగ్గుతోంది...టాప్ టెన్ లో పత్తా లేని కెసిఆర్
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత కొంత కాలంగా మాట్లాడితే 175 కు 175 సీట్ల జపం చేస్తున్న విషయం తెలిసిందే. కీలకవిషయాల్లో ప్రజలకు హ్యాండ్ ఇచ్చినా కూడా అసలు జగన్ ఏ ధైర్యంతో ఇలా చెపుతున్నారు అంటూ విస్తుపోవటం సొంత పార్టీ నేతల వంతు కూడా అవుతోంది. ఈ తరుణంలో వచ్చిన ఇండియా టుడే- సి ఓటర్ మూడ్ అఫ్ నేషన్ వివరాలు మాత్రం జగన్ గ్రాఫ్ భారీగా పతనం అవుతోంది అని చెపుతోంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా ముఖ్యంగా పార్టీ నాయకుడి ఇమేజితోనే నెట్టుకొస్తుంది అనే విషయం తెలిసిందే. అదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు కూడా చాలావరకు పనికొస్తాయి. అయితే జగన్ విషయంలో మాత్రం సొంత రాష్ట్రంలో ఆయన పాపులారిటీ 39 .7 శాతానికి పడిపోయింది. ఇది గత ఏడాది 56 .5 ఉండటం విశేషం. అయితే దేశం మొత్తంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎం ల లెక్కలు తీస్తే ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ టాప్ టెన్ జాబితాలో పదవ ప్లేస్ లో ఉండటం కొంతలో కొంత ఆయనకు ఊరట కలిగించే పరిణామం అని చెప్పుకోవచ్చు.

ఈ టాప్ టెన్ లో దేశానికి తాను మాత్రమే దారి చూపిస్తాను...బిఆర్ఎస్ కి అధికారం అప్పగిస్తే ఇండియాను అమెరికా, చైనా ల కంటే ముందుకు తీసుకెళ్తాను అని చెపుతున్న తెలంగాణ సీఎం కెసిఆర్ పేరు లేకపోవటం మరో కీలక విశేషం. వారి వారి సొంత రాష్టాల్లో పాపులర్ సీఎం ల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు. రెండవ ప్లేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. గత ఏడాది కంటే 2023 లో అరవింద్ కేజ్రీవాల్ పాపులారిటీ గణనీయంగా పెరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పాపులారిటీ 69 . 2 శాతంగా ఉంది. మూడవ ప్లేస్ లో అస్సాం సీఎం హిమంతా బిస్వా శర్మ నిలిచారు. నాల్గవ ప్లేస్ లో ఛత్తీస్గఢ్ భూపేష్ బేగెల్, ఐదవ స్థానంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ నిలిచారు.

Next Story
Share it