Telugu Gateway
Politics

దేశానికికి ప్ర‌త్యామ్నాయ ఏజెండా కావాలి

దేశానికికి ప్ర‌త్యామ్నాయ ఏజెండా కావాలి
X

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ ప్లీన‌రీలో రాజ‌కీయ అంశాల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో కూడా చాలా ఫ్రంట్ లు వ‌చ్చాయ‌ని..వాటి వ‌ల్ల ఏమి జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ప్ర‌త్యామ్నాయ ఏజెండా అని పేర్కొన్నారు.అంతే త‌ప్ప బీజేపీని గద్దె దించడమో..రాజకీయ గుంపు క‌ట్ట‌డ‌మో...కొంత మంది నేత‌ల‌ను పోగు చేయ‌ట‌మో కాద‌న్నారు. టీఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జాడ్యాలు, అవాంఛితమైన, అనారోగ్యకరమైన, అవసరమైన పెడధోరణులు ప్రబలుతున్నాయన్నారు. వ‌న‌రుల ప‌రంగా చూస్తే సింగ‌పూర్ ఎంతో ప్ర‌గతి సాధించింద‌ని..కొన్ని సంవ‌త్స‌రాల క్రితం చైనా కూడా ఎంతో వెన‌క‌బ‌డి ఉంద‌న్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు దేశాలు ఎంతో ముందంజ‌లో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అన్నీ ఉండి కూడా భార‌త్ మాత్రం చాలా వెన‌క‌బ‌డి ఉంద‌న్నారు. ఒక రాష్ట్రంగా ఏం చేయాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ అభ్యున్నత కోసం యధాశక్తిగా కృషి చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు.

రాష్ట్రం సాధించిన ప్రాసెస్ త‌ర‌హాలోనే..దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో న‌డ‌ప‌టానికి కూడా ఓ ప్రాసెస్ ఉంటుంద‌ని..ఇప్పుడు అదే దిశ‌గా ముందుకు సాగాల్సి ఉంద‌న్నారు. కొంత మంది మాట‌లు వింటే, ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయి. వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితిని వ్యాఖ్యానించారు. మట్టిని కూడా సింగపూర్‌ పొరుగుదేశం నుంచి తెచ్చుకుంటుంది. నీళ్లు కూడా మలేషియాదే. కానీ, వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతుబద్ధమైన వాదం. స్వచ్ఛమైన కఠోరమైన వాస్తవం. కాదనుకుంటే తాను ఈ మాట‌లు చెప్పిన‌ప్పుడునీతి ఆయోగే ఖండించేది కదా అని ప్ర‌శ్నించారు. కొన్ని పార్టీల మిత్రులు మనమంతా ఏకం కావాలని, బీజేపీని గద్దె దించాలని కోరారు. చెత్త ఎజెండా తాను వెంట రాలేనని చెప్పానని సీఎం కేసీఆర్‌ అన్నారు. గద్దె ఎక్కించాల్సింది ప్రజలనని, తెలియజేయాల్సింది ప్రజలకు, మారాల్సింది దేశ ప్రజల జీవితాలు, కావాల్సింది మౌలిక వసతులని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it