Telugu Gateway
Politics

నేను క్రిమిన‌ల్ ను కాదు..కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నేను క్రిమిన‌ల్ ను కాదు..కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

ఓ ముఖ్య‌మంత్రి ఇంత‌టి సంచ‌ల‌న వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వ‌చ్చింది. అస‌లు ఎవ‌రు ఆ ముఖ్య‌మంత్రి..ఎందుకు ఈ మాట‌ల‌న్నారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అంటే ప్ర‌ధాని మోడీకి ఏ మాత్రం గిట్ట‌దు. బిజెపి నేత‌లు కూడా ఆయ‌న్ను ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా ఎటాక్ చేస్తూనే ఉంటారు. ఓ ముఖ్య‌మంత్రి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండా అడ్డుకోవ‌టం అంటే ఖ‌చ్చితంగా ఇది రాజ‌కీయ కోణంలోనే అన్న విష‌యం స్ప‌ష్టం అవుతూనే ఉంది. పోనీ అది ఏమైనా వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌నా అంటే అదీ కాదు. సింగ‌పూర్ ప్ర‌భుత్వ ఆహ్వానం మేర‌కే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆ దేశంలో జ‌రిగే వ‌ర‌ల్డ్ సిటీస్ స‌మ్మిట్ కు హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ మేర‌కు అనుమ‌తి కోసం ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ కు అనుమ‌తి కోసం ప్ర‌తిపాద‌న పంపారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అనుమ‌తి రాలేదు. దీంతో అర‌వింద్ కేజ్రీవాల్ తాజాగా ఇదే అంశంపై ప్ర‌ధాని మోడీకి లేఖ కూడా రాశారు. త‌న‌కు అనుమ‌తి ఇచ్చేలా చూడాలన్నారు. సింగ‌పూర్ లో జ‌రిగే వ‌ర‌ల్డ్ సిటీస్ స‌మ్మిట్ లో ఢిల్లీ మోడ‌ల్ ను ప్ర‌జంట్ చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని..ఇది త‌న‌కే కాదు..దేశం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు. త‌న సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని పేర్కొన్నారు. ఈ స‌మావేశాలు ఆగ‌స్టు మొద‌టి వారంలో జ‌ర‌గ‌నున్నాయి. తొలి రోజే ఈ స‌మావేశాల్లో మాట్లాడేందుకు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు.

Next Story
Share it