ఎస్ఈసీ ఆదేశాలు ఖాతరు చేయను
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూడాలని ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలపై మంత్రి స్పందించారు. ఆదేశాలు ఇచ్చే ముందు అవి అమలు అవుతాయో లేదో చూసుకోవాలని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. తాను రాష్ట్ర మంత్రిని అని..తన పని తాను చేసుకుంటానన్నారు. ఎస్ఈసీ ఆదేశాలను ఖాతరు చేయబోనన్నారు. అదే సమయంలో మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవాల అంశంపై కూడా స్పందించారు.
జగన్ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవాలు అవుతాయన్నారు. ఎవరైనా కాదని,,ఎస్ఈసీ చెప్పారని..టీడీపీ వైపు అధికారులు పనిచేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఈసీ ఇలాంటి పిచ్చి నిర్ణయం ఏదో తీసుకుంటాడని తాను అనుకున్నానని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ఆఫ్ట్రాల్ ఓ రిటైర్డ్ అధికారి అని అన్నారు. చంద్రబాబుకు మేలు చేసేలా పిచ్చోడిలాగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.