Telugu Gateway
Politics

గెల్లు శ్రీనివాస్ నామినేష‌న్

గెల్లు శ్రీనివాస్ నామినేష‌న్
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ శుక్ర‌వారం నాడు వెలువ‌డింద‌ది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన తొలి రోజే అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గెల్లు శ్రీనివాస్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న వెంట మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. గెల్లు శ్రీనివాస్ ఇటీవ‌లే పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ నుంచి బీ ఫాం తీసుకుని వెళ్ళిన విష‌యం తెలిసిందే. నామినేష‌న్ కు ముందు గెల్లు శ్రీనివాస్ కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్‌ చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో శ్రీనివాస్‌ యాదవ్‌ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

Next Story
Share it