హూజూరాబాద్ ఎన్నిక చాలా చిన్న విషయం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో అసలు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశంపై చర్చే రాలేదన్నారు. సహజంగా ప్రజల ఆశీస్సులు తమ పార్టీకే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. సమావేశం వివరాలను మంత్రి కెటీఆర్ మీడియాకు వివరించారు. సెప్టెంబరు 2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దళితబంధుపై ప్రజలను చైతన్యం చేయాలని సీఎం పిలుపునిచ్చారన్నారు. దళితబంధును ఉద్యమం లాగా చేయాలని సూచించారు. వచ్చే 20 ఏళ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందన్నారు. బీసీబంధుతో సహా అన్నిఇస్తామన్నారు. దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. కొత్తగా జిల్లా అధ్యక్షులను నియమించనున్నట్లు తెలిపారు. 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కెసీఆర్ అక్టోబర్ లో ప్రారంభిస్తారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయటంపై ఈ సమావేశంలో ఎక్కవగా చర్చించామన్నారు. అక్టోబర్ లేదా నవంబర్ లో టీఆర్ఎస్ ఇరవై ఏళ్ళ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. నికిమాలిన ప్రతిపక్షాలు చేసే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టు గా మొదలు పెట్టిన దళితబంధు పథకం అమల్లో లో పాల్గొనాలన్నారు. ఎపుడు ఏ పథకం అమలు చేయాలో ప్రభుత్వానికి తెలుసని, హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు...కేంద్రం లో ప్రభుత్వం మారేది లేదని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ లో దళితబంధు సక్సెస్ అయితే దేశం తెలంగాణను చూస్తది. హుజురాబాద్ టీఆరెస్ పార్టీకి కంచుకోట అని వ్యాఖ్యానించారు. ఈటెలకు ముందు కూడా పాత కమలాపూర్ నియోజక వర్గం లో టీఆరెస్ బలంగా ఉంది ...ఈటెల రాజేందర్ 2003 లో టీ ఆర్ ఎస్ లో చేరారని తెలిపారు.