Telugu Gateway
Politics

ఎన్టీఆర్ ను పిలిచి..రామ్ చ‌ర‌ణ్ ను మ‌రిచి!

ఎన్టీఆర్ ను పిలిచి..రామ్ చ‌ర‌ణ్ ను మ‌రిచి!
X

Home Minister Amit Shah met Jr NTR in Hyderabadఅస‌లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఎన్టీఆర్ ల భేటీ ఉద్దేశం ఏమిటి?. ఆర్ఆర్ఆర్ సినిమాపై అభినందన‌కా..లేక రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌కా?. ఈ విష‌యంలో ఎవ‌రికీ తోచిన ఊహ‌గానాల వాళ్లు చేసుకుంటున్నారు. అస‌లు విష‌యం వాళిద్ధ‌రికీ త‌ప్పు ఎవ‌రికీ తెలియ‌దు. ఆర్ఆర్ఆర్ లో కొమ‌రం బీమ్ పాత్ర పోషించిన ఎన్డీఆర్ ను అభినందించ‌టానికే ఈ భేటీ అని బిజెపి ప్ర‌చారంలో పెట్టింది. కాసేపు ఇదే నిజం అనుకుందాం. అమిత్ షాకు కేవ‌లం ఎన్టీఆర్ పోషించిన కొమ‌రం భీమ్ పాత్ర ఒక్క‌టే న‌చ్చిందా.. రామ్ చ‌ర‌ణ్ పోషించిన అల్లూరి సీతారామ‌రాజు పాత్ర న‌చ్చ‌లేదా అన్న చ‌ర్చ ప్రారంభం అయింది. తాజాగా ఏపీలో ప్ర‌ధాని మోడీ అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా స్వ‌యంగా చిరంజీవిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. కౌగిలించుకున్నారు. కానీ ఇప్పుడు అమిత్ షా మాత్రం కేవ‌లం ఎన్టీఆర్ ను మాత్ర‌మే పిలిచి మాట్లాడారు..క‌ల‌సి విందు చేశారు. రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా బిజెపితో పొత్తులో ఉన్న జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అన్న కొడుకు. చిరంజీవి త‌న‌యుడు. ఇన్ని లింక్ లు ఉన్నా అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమా విష‌యంపై ప్ర‌శంసించ‌టానికే పిలిస్తే రామ్ చ‌ర‌ణ్ ను కూడా పిల‌వాలి క‌దా అన్న చ‌ర్చ సాగుతోంది. దీంతో అమిత్ షా, ఎన్టీఆర్ ల భేటీలో సినిమాకు మించి ఏదో జ‌రిగి ఉంటుంది అన్న చ‌ర్చ సాగుతోంది.

ఓ సామాజిక వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకునేందుకే బిజెపి నేత‌లు ప్లాన్ చేశార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఎలాగూ ప‌వ‌న్ త‌మ‌తో ఉన్నాడు కాబ‌ట్టి..ఇప్పుడు కేవ‌లం ఎన్టీఆర్ వైపు మాత్ర‌మే ఫోక‌స్ పెట్టార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ స్వ‌యంగా బిజెపి వైపు తిరిగినా ఆ సామాజికవ‌ర్గం బిజెపి వైపు చూడటం అంత తేలిగ్గా జ‌రిగే వ్య‌వహారం కాద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే త‌మిళ‌నాడులో సూప‌ర్ స్టార్ గా ఉన్న ర‌జ‌నీకాంత్ ను వాడుకోవాల‌ని చూసిన‌ట్లు ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా ఓ గాలం వేసిన‌ట్లు ఉన్నార‌నే చ‌ర్చ సాగుతోంది. దేశంలో ఇప్పుడున్న్ ప‌రిస్థితుల్లో ఎంత పెద్ద హీరో అయినా అమిత్ షా క‌ల‌వాల‌నుకుంటున్నారంటే కాద‌నే ప‌రిస్థితిలేద‌నే చెప్పొచ్చు. కాదు కూడ‌దు అని ఎవ‌రైనా ఉంటే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అందుకే పిల‌వ‌గానే ఎన్టీఆర్ కూడా అమిత్ షా ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తారు కానీ ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయాల జోలికి రాక‌పోవ‌చ్చ‌ని ఆయ‌న స‌న్నిహితుల అభిప్రాయం.

Next Story
Share it